sahithivani

sahithivani

సాహితీ వాణి

(A Monthly Peer-Reviewed Online Multidisciplinary Telugu & English Research Journal)

Literature & Languages | Linguistics | Performing & Visual Arts | Humanities & History

ISSN: 3139-6283 (Online)

Publishing by.. Dr.lakshmanarao adimulam, Sri Mayuri Fine arts Association Regd No : 90/2024 H.No : 5-227, Sriram puram, school Veedhi, Rajanagaram, East Godavari - 533296, Andhra Pradesh. India. Cell;: 8522967827.

లక్ష్మి గొల్లపల్లి సాహిత్యం – ఒక పరిశీలన డా॥.సి. సరళదేవి.

లక్ష్మి గొల్లపల్లి సాహిత్యం – ఒక పరిశీలన

“The Literature of Lakshmi Gollapalli – A Study”

Volume – 1,                                            October 2026,                                          issue – 7,

సమర్పణ (D.O.S): 12-09 – 2026               ఎంపిక (D.O.A): 20– 09 – 2026          ప్రచురణ (D.O.P) :  01-10-2026  

-డా॥.సి. సరళదేవి.

వ్యాస సంగ్రహం:

తెలుగు దళిత సాహిత్యంలో దళిత స్త్రీల అనుభవాలు, అస్తిత్వ సంఘర్షణలు, సామాజిక వివక్షలు, ఆత్మగౌరవం వంటి అంశాలు విశిష్టమైన స్థానాన్ని పొందాయి. ముఖ్యంగా గోదావరి ప్రాంతానికి చెందిన దళిత రచయిత్రుల సాహిత్యం సామాజిక అసమానతలను ప్రశ్నిస్తూ, అణగారిన వర్గాల జీవిత వాస్తవాలను సాహిత్య వస్తువులుగా మలచింది. ఈ నేపథ్యంలో లక్ష్మి గొల్లపల్లి సాహిత్యం ప్రత్యేకంగా పరిశీలించదగినది. ఆమె రచనల్లో దళిత జీవితం, కులవివక్ష, అంటరానితనం, మతపరమైన వివక్ష, ఆర్థిక అసమానతలు, స్త్రీలపై జరుగుతున్న అణచివేత, దళితుల ఆత్మగౌరవం వంటి అంశాలు ప్రధానంగా ప్రతిఫలిస్తాయి.

లక్ష్మి గొల్లపల్లి కవితలు, పాటలు, నానీల ద్వారా దళితుల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవితాన్ని చిత్రించారు. అంబేద్కర్ ఆలోచనా విధానం, కుల నిర్మూలన, విద్య, సమానత్వం, స్వేచ్ఛ, ఆత్మగౌరవం వంటి భావాలు ఆమె రచనల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ‘మహర్ జ్యోతి’, ‘దళిత దర్శనం’, ‘పంచమ వేదాలు’, ‘కలం కథన రంగాన మారింది’, ‘నీలి పతంగం’, ‘మనువు చేతిలో మగువ’, ‘కామందూ ఖబడ్దార్’, ‘మీరట్లు అనుకుంటే’, ‘మేము నాగులం’, ‘చెప్పుదెబ్బ’, ‘శాస్త్రి’, ‘వైట్ కాలర్స్’ వంటి కవితల్లో కులాధిపత్యం, మతపరమైన మూఢత్వం, దళితులపై జరుగుతున్న వివక్ష, దళిత స్త్రీలపై హింస, సామాజిక దోపిడీ వంటి సమస్యలను ఆమె ప్రశ్నించారు.

అలాగే ఆమె నానీలలో మతం, మానవత్వం, తల్లిదండ్రుల పట్ల బాధ్యత, రైతుల సమస్యలు, అంటరానితనం వంటి సామాజిక అంశాలను సంక్షిప్తమైన, ప్రభావవంతమైన రూపంలో వ్యక్తీకరించారు. పాటల ద్వారా దళితులలో చైతన్యం, విద్య, ఆత్మవిశ్వాసం, సామాజిక సమానత్వం పట్ల అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. ఈ విధంగా లక్ష్మి గొల్లపల్లి సాహిత్యం దళిత స్త్రీ అనుభవాలనే కాకుండా, కుల, మత, లింగ, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా సాగిన సామాజిక చైతన్య స్వరంగా నిలుస్తుంది. ఆమె రచనలను పరిశీలించడం ద్వారా తెలుగు దళిత సాహిత్యంలో దళిత స్త్రీల స్వీయ వ్యక్తీకరణ, ప్రతిఘటన, ఆత్మగౌరవం, సామాజిక మార్పు ఆకాంక్షలను అవగతం చేసుకోవచ్చు.

Abstract :

In Telugu Dalit literature, the experiences of Dalit women, struggles for identity, social discrimination, and self-respect have acquired a significant place. In particular, the literature of Dalit women writers from the Godavari region has questioned social inequalities and transformed the lived realities of marginalized communities into important literary themes. In this context, the literature of Lakshmi Gollapalli deserves special scholarly attention. Her writings prominently reflect issues such as Dalit life, caste discrimination, untouchability, religious discrimination, economic inequalities, oppression of women, and the struggle for self-respect among Dalits.

Through her poetry, songs, and Naneelu, Lakshmi Gollapalli portrays the social, economic, and cultural life of Dalits. The influence of Dr. B. R. Ambedkar’s ideology, along with ideas of the annihilation of caste, education, equality, freedom, and self-respect, is clearly evident in her writings. In poems such as Mahar Jyothi, Dalita Darshanam, Panchama Vedalu, Kalam Kathanarangamlo Maarindi, Neeli Patangam, Manuvu Chetilo Maguva, Kamandhu Khabaddar, Meeratlu Anukunte, Memu Nagulam, Cheppudebba, Shastri, and White Collars, she questions caste domination, religious orthodoxy, discrimination against Dalits, violence against Dalit women, and various forms of social exploitation.

Similarly, through her Naneelu, she expresses social concerns relating to religion, humanity, responsibility towards parents, the problems of farmers, and untouchability in a concise yet impactful manner. Through her songs, she seeks to promote awareness among Dalits regarding education, self-confidence, and social equality. Thus, the literature of Lakshmi Gollapalli emerges not only as an expression of Dalit women’s experiences but also as a voice of social consciousness against caste, religious, gender, and economic inequalities. A study of her writings helps us understand the self-expression, resistance, assertion of self-respect, and aspirations for social transformation articulated by Dalit women within Telugu Dalit literature.

కీలక పదాలు (Keywords):

లక్ష్మి గొల్లపల్లి, దళిత సాహిత్యం, దళిత స్త్రీ సాహిత్యం, దళిత చైతన్యం, కులవివక్ష, అంటరానితనం, స్త్రీవాద దృక్పథం, ఆత్మగౌరవం, అంబేద్కర్ భావజాలం, సామాజిక సమానత్వం.

Keywords:

Lakshmi Gollapalli, Dalit Literature, Dalit Women’s Literature, Dalit Consciousness, Caste Discrimination, Untouchability, Feminist Perspective, Self-Respect, Ambedkarite Ideology, Social Equality.

పరిచయం :

తెలుగు సాహిత్యంలోనే దళిత పురుషులకు చోటు తక్కువనే చెప్పాలి. నిషేధాలు, అంటరానితనం, కులవివక్ష, వీటి మధ్య ప్రముఖ దళిత రచయితలు జాషువా, కుసుమ ధర్మన్న, తాడి నాగమ్మ, బోయి భీమన్న, మొదలైన రచయితలు తెలుగు సాహిత్యంలో వారి ప్రతిభను సాటిన కులం కారణంగా విస్తృతంగా కాలేదని చెప్పవచ్చు.

దళిత జీవితం స్త్రీ పురుషులకు సమానమే అయినా లింగ వివక్షత కారణంగా దళిత స్త్రీ జీవితం దయనీయంగా వుంటుంది శ్రామిక వర్గాలకు సంబంధించిన దళిత స్త్రీలు సాహిత్యంలో తమకంటూ చోటు దక్కించుకున్నారు. వారిలో గోదావరి జిల్లాలకు చెందిన రచయిత్రులు వారి రచనలు ద్వారా వారి ప్రతిభను సాటారు. తాడి నాగమ్మ, జాలా మంగమ్మ బోయి ద్రౌపది, కొమ్ము దమయంతి, పంతగడ శేషమ్మ, గేద్దాడ కస్తూరి, డా. బోయి విజయ భారతి ఆచార్య శరత్ జ్యోత్స్నారాణి లాంటి రచయిత్రులలో గొల్లపల్లి లక్ష్మి ఒకరు వీరు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు శెట్టిపేట గ్రామంలో జన్మించారు. డిగ్రీ వరకు చదివారు. 1987లో గొల్లవల్లి అంబేద్కర్తో (న్యాయవాది) వివాహం జరిగింది. వీరికి ఇద్దరూ సంతానం సాహిత్య సభలకు హజరై తాను రాసిన పాటను తమ కుమారైలతో పాడించుకునేవారు.

గోదావరి జిల్లాలో ప్రప్రథమ దళిత రచయిత్రి అయిన లక్ష్మి దళితోద్యమ ప్రభావాలకు లోనైంది. ఆత్మగౌరవంతో బాటు, ఆత్మస్థైర్యం ఆమె రచనకుతోడై తన కలం నుండి అద్భుతమైన సాహిత్యం వెలువడింది.

విషయ వివరణ :

గొల్లపల్లిలక్ష్మి రాసిన కవితలు, నానీలు, పాటలు కలిపి ఒక పుస్తకంగా తీసుకు రావడం జరిగింది.

కవితలు :

లక్ష్మి రాసిన మొదట కవిత ‘మహార్ జ్యోతి’ ఇందులో చిన్నబోయిన దళిత జాతి..చివాలున తలెత్తిన రోజు

బీడువారి బతుకులో తేనెవానలు కురిసిన రోజు దళిత జాతి భాస్కరుడు అంబేద్కరుడు దయించిన రోజు”

దళిత ఉద్దారకుడు అంబేద్కర్ దళితుల జీవితాల్లో గొప్ప మార్పును తీసుకొచ్చాడు.

‘దళితులు అష్టకష్టాల నుండి అదృష్టం వచ్చిన రోజలు దళిత రక్షకుడి కీరిస్తూ రాసిన మొదట కవిత ‘మహర్ జ్యోతి’

మరో కవిత ‘దళిత దర్శనం” ఈ కవితలో హైందవ సంస్కృతిలో, మను ధర్మం మూలాన సృష్టించి దళితులకు జరిగిన “అన్యాయాన్ని వివరిస్తూ

నిలువెల్లు హైందవం

నుదిటి మీద క్రైస్తవం

ఏది నీదైన దళిత తత్వం

నీదైన ఉత్కృష్ట

సంస్కృతిని విస్మరించి

హైందవ పడగ నీడలో నో

క్రైస్తవ మేలిముసుగు నీడలోను

తలదాచుకునే తాపత్రయం

నీ కులకుష్టులను కప్పుకోడానికైలే

కప్పుకోకు అస్పృశ్యం

తప్పుకో అవశ్యం”( నిశ్శబ్ద శబ్దం – లక్ష్మి గొల్లపల్లి సాహిత్యం ,పుట – 5 )

అంటూ క్రైస్తవ, హిందూ మత మధ్య వున్న వ్యాత్యాసాన్ని వివరిస్తూ”, ఆదమరిచి, నిదురించే దళిత స్త్రీని నుదిటి బొట్టు లేక పోవడం వల్ల తక్కువ కులం అంటూ దూషించడం జరుగుతుందని వాపోతుంది. మతం, పేరుతో కులం పేరుతో దళితులు ఎదుర్కొంటున్న దారుణమైన అస్పృశ్యతను ఈ కవితలో చాటారు.  దళిత సాహిత్యం తాత్విక దృక్పదం పుస్తకంలో లక్ష్మీ నరసయ్య .జి. అభిప్రాయాన్ని ప్రస్తావించారు.(ఈ) తన కవితద్వార

మతోన్మాద – ధ్యాన కీటకాలు

మోహరించి కాచుకున్నాయి

సమైక్యాన్ని కోరే సాలీళ్ళు

సమిథలై పోతున్నాయి. మతం పేరుతో కులం పేరుతో రాజ్యాలు పరిపాలిస్తున్నారు. అంటూ, సాంఘిక, అసమానతలు, రాజకీయ, దోపిడీలు కాక కరువులు, వరదలు, తూఫానులు, భూకంపాలు, మొదలైన తీవ్రపరిణామాల గురించి “భల్లూక భక్తి” కవితలో వివరించారు..

పంచ(మ) వేదాలు కవితలో

“మాకుంది వేదం

మానం చెరచబడ్డ చెల్లెళ్ళ

శతమానం తెగపడ్డ తల్లుల

గుండెలు నిండారి పొంగిన

నిర్వేదాల రౌద్ర వేదం “ (నిశ్శబ్ద శబ్దం – లక్ష్మి గొల్లపల్లి సాహిత్యం , పుట – 10 ) అంటరాని వాళ్ళు అంటూ, అంటుకోకూడదు, ముట్టుకోకూడదు అంటూనే జీవనోపాధి

కోసం వెళ్ళిన ధళిత స్త్రీల మాన, ప్రాణాలను దోచుకున్న వైనం పై కవితలో వివరించారు.

ముకుంది వేదం

చెప్పుకుట్టెనా చద్ది కరువై

పాలిషు చేసినా పస్తుండీ

కష్టజీవుల ఖర్మ జీవుల

కొరకు పొలంలో పుట్టిన కర్మవేదం(నిశ్శబ్ద శబ్దం – లక్ష్మి గొల్లపల్లి సాహిత్యం, పుట -12 )

పేదరికంలో అలమటిస్తూ,కుల వృత్తులు నమ్ముకొని సంపాదించిన అరకొర డబ్బులతో జీవం సాగించ లేక దళితులు పడే బాధ, వేదనలను లే వారె ‘వేదం’గా అభివర్ణించారు.

దళిత రచయితలు గురించి రాసిన కవిత ‘కలం కథన రంగాన మారింది’. “బానిసత్వ శృంఖాలు ఛేదించిన కలం భావ విప్లవ బ్యానర్ గురిపెడుతుంది వెతల బతుకుల్లో విరిగి నలిగిన కలం మాల చరిత్రల్ని తిరగరాస్తోంది. దళిత తల్లికంటి శోకమే కాల సర్పమై హైందవ దురహంకారాన్ని కసితీరా కాటేసింది.

దళిత రచయితలు తాము పడిన బాధల్ని తన కలం నుండి జాలువారిన దుఃఖాల్ని సాహిత్యంలో రూపంలో తీసుకురావడానికి వాళ్ళు చేసిన కృషి ఏ విధంగా వుందో వీరు చక్కగా వివరించారు.

కులం అహంకారంపై లక్షల అక్షరపుటవై అమానవీయాల్ని గొంతెత్తి ఘోషిస్తున్నాయి.- దళిత సత్తా కలం పట్టి గళం విప్పిన పదునెక్కిన పదాలతో ద్వజమెత్తిన గళాలం నిన్న నేడు రేపు నైనా నిలదీసే నిజాలం.

సృజనాత్మక శక్తులం) – అంటూ దళిత ఆత్మ నివేదనలన్ని ఈ కవిత ద్వారా వివరిస్తూ సాహిత్యంలో తమకంటూ ఒక పదిలమైన స్థానాన్ని నిలబట్టుకోగలిగిన సృజనాత్మకత దళిత రచయితలు తమ గళం. కలం ద్వారా పదునైన పదాలలో గొంతెత్తి చాటారు.

 మతాల దాష్టికం ‘అబలత్వం వారసత్వం’ అనే కవిత రచయిత స్త్రీ ఎలా వుండకూడదో వివరిస్తూ, భర్త ఆగడాలను భరించే స్త్రీలకు విన్నవం ఈ కవితలో రచయిత స్త్రీవాద ధోరణితో చెప్పారు.

అణుకువుగా ఉండు

అణిగి మణిగి ఉండు

ఒద్దికగా ఉండు

ఏమైనా ఎందుకైనా

తప్పు మరింత తప్పు  (నిశ్శబ్ద శబ్దం – లక్ష్మి గొల్లపల్లి సాహిత్యం, పుట – 16) రచయిత స్త్రీ ఎలా వుండకూడదో వివరిస్తూ భర్త ఆగడాలను భరించే స్త్రీలకు విన్నపం ఈ మితిమీరినా సహనం వెల్ సెటిల్ద్ కవితలో

ఊడిగాలు ఉపవాసాలు పోయి ఉద్యోగంలో స్థిరపడిన తన బంధాలకు బాంధ్యవాలకు వులుస్టాప్ పెట్టి తను ప్రతీది, అధునాతనం, ప్రతీది కొత్తది. ఎక్కడో పాత వాసన, వెతకబోయిన తీగ దోరికింది. భార్య పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి చీ పాత పెళ్ళాం అవును మరి సెటవ్ లేకుండా సెటిల్డ్మటి? పురుషుడి మనస్తత్వాన్ని తెలిపే కవిత.

“నీలి వతంగం కవితలో

కులం కోటలు కూల్చి

మతం మరుగును దాటి

విహంగము ఎగిరిపో

గాలివై జాలివై

దళిత జాతి మేలివై

ఎగిరిపో ఎగిరిపో

ఎల్లలు చెరిపేసివో “(నిశ్శబ్ద శబ్దం – లక్ష్మి గొల్లపల్లి సాహిత్యం పుట – 21 ) – అంటూ దళితులకు స్వేచ్ఛ లేదు అని పరోక్షంగా చెబుతూ మనిషికి కులం, మతం అనే వలలో చిక్కి బందీలుగా బతకటం కంటే పక్షిలా స్వేచ్ఛగా ఎగిరిపో అని రచయిత అంటూ

విహంగము ఎగిరిపో…

పంజరాలు లేని నవ్యజగంలోకి

బంధనాలు వదిలి భవ్య పధానికి

ఎండమావులు లేని ఎడారిలోనికి

కట్టు బాటుల్లేనికి కరుణ రాజ్యనికి

సమాజంలో అనేక కట్టుబాటులకు లోబడి వుంటాయి అంధకారం, నుండి బయటకు

రమ్మంటూ స్వేచ్ఛ కోసం నీలి పతాకం మై ఎగిరిపో అంటుంది.

“మనువు చేతిలో మగువ” స్త్రీని వ్యాపార చిత్రించిన తీరును వివరించారు.

నేనో ఆదిశక్తిని, పరాశక్తినని

త్యాగముయిన అనురాగమయినని

పొగడ్తలవర మాటున

తన ప్రవృత్తిని దాచేసుకున్నాడు.

అని స్త్రీ ఆనాడు పొగడ్తు రాసే

అన్ని మత గ్రంథాలు స్త్రీ పురుషుడికి అణగి మణిగి వుండాలని సూచిస్తాయి. కావ్య రచయితలు స్త్రీ, శృంగార వస్తువుగా చిత్రించారు ? విలాశాలకు ఒక వస్తువుగా స్త్రీ దొరికిందని అగాంగ వర్ణించే స్త్రీ ప్రాచీన కవులు వివరించారు.

“మను పంజరంలో బంధించి

ఆధిపత్య మదంతో

నా తనువుని తలపుల్ని

అగ్గిపెట్టికి. అండర్వేర్ లకి

సబ్బు బిళ్ళకి, షేవింగ్ బ్లేడ్లకి

 నిస్సగ్గుగా నిర్లజ్జగా నా అందాన్ని”( నిశ్శబ్ద శబ్దం – లక్ష్మి గొల్లపల్లి సాహిత్యం

, పుట – 23 )

 అంగాంగానికి అసభ్య చిత్రణ చేసి, తెరకిక్కించి స్త్రీ అవయవాల్ని వర్తమాన వాణిజ్య ప్రకటనల ధోరణిని చిత్రించిన తీరును చెబుతూ ప్రతి మగవాడిలో మనువు దాగి వున్నాడనే అని సత్యాన్ని దైర్యంగా చెప్పారు.

ఈ మనుగాడి మాయలో మానవతులు మనుగడకు ఎన్ని మలుపులు, ఎన్ని మజిలీలు దేశ సంస్కృతికి చెదలు పట్టిందే సాంప్రదాయం చెరపట్టబడిందే కామాందూ – ఖబడ్డార్ కవితలో

మనువు చెప్పిన హిందూ సంప్రదాయం అనే అడ్డుగోడలు ఈ చెదలు పట్టిన సంస్కృతిని రచయిత్రి ప్రశ్నిస్తుంది.

దోరబిడ్ద దోరబిడ్ద ఆళ్ళు అనేటోళ్ళు మనం పడేటళ్ళమని, ఆయన చెప్పేబానిస బోధలు చెవినెట్టకపోతే

నా బిడ్డని మంచి నీళ్ళు వంకలో

మకాంలోకి పిలిచి మానం ‘దోచుకున్నాడే నాకంతా తెలిసిపోయింది.

దాడికి ప్రతిదాడికి సిద్ధం కాండి అని ప్రేరేపించే విధంగా ప్రబోధిస్తూ..

“మీ చచ్చిన గొడకులోళ్ళువలిచేవాళ్ళ మీతాటతీసితోలు బలచలేమనుకోవద్దు

కామందూ ఖబడ్డార్” అంటూ

హెచ్చరిక చేస్తుంది.

“మీరట్లు అనుకుంటే” కవితలో అన్నెంపున్నెం ఎరుగని మమ్మల్ని అంటరానోళ్ళమని మీరనుకుంటే మా ఆత్మాభిమానం ఏరై సెలయేరై, నదై, సాగరమై అవమానాలను వరదై ఉప్పొంగేదా

దళితుల్ని కులం పేరుతో దూషిస్తే వాళ్ళ కలిగే అవమానం గురించి చెబూతూ

కులం పేరుతో శంభూకుని తల ఖండించకుంటే గురు దక్షిణ పేరుతో ఏకలవ్యుని వేలు తెగనరక కుంటే దళిత దేవుడు అంబేద్కర్ని నల్లబల్లని తాకవద్దు అని అడ్డగించకపోతే ఆ సరస్వతి దేవి ఉద్రేకంతో వచ్చి మా గుండెల్ని హత్తుకొని మా ఆవేదనా లింగునంతో మా కతల వెతల్ని బతికించి పులకించేదా? అంటూ ప్రశ్నిస్తుంది రచయిత్రి.

మేము నాగులం.

ఈ దేశ మూలవాసులం రాజ్యలు పోయాయి ఐనా రాజసం పోలేదు. నీచ ప్రవృత్తలం కాము యాచక వృత్తి తెలినోళ్ళం పరాన్న భుక్కులంకాము శ్రమ దోపిడి తెలీదు

కాయకష్టం చేస్తాం

కడుపుమంటను తింటాం

ఆత్మాభిమానం మా సొత్తు

ఆత్మ గౌరవం మా తలకట్టు మేము ఆది వాసులం

అంటూ దళితుల్ని చైతన్యం వైపు నడిపించే విధంగా ఈ కవిత సాగింది…..

ఒరేయే ఈరిగా

జత చెప్పులు కుట్టి మీరు తెమ్మంటే నా తోలు వొలిచి మెత్తటి చెప్పులుకుట్టాదొరా!

ఆ చెప్పులు మీ కాళ్ళకు రక్షణకే కాదు

మా చెంపలు పగలుగొట్టేందుకు కూడా

పని కొస్తాయని అప్పుడు నేననుకోలేదు.

మాదిగల కులవృత్తి చెప్పులు కుట్టి. అందరి పాదాలకు రక్షణ కలిగిస్తారు. చెప్పుకి రూపం ఇచ్చిన రూపకర్తకు ఆదే చెప్పుతోనే దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఏర్పడిందని. అ ఇది అగ్రకులాలు వారి దౌర్జున్యాలకు నిదర్శనయని పై కవిత ఉద్భోవిస్తుంది.

మీ పిల్లనో పాలి ఇంటికి పిలుచుకుని మీర్రమ్మంటే లగెత్తుకెల్లి రాననన్న దాన్ని మీ ముందరుంటా దొరా…… అది చిన్న దొరసాని, సావాసానికే కాదు చిల్లర మాటలతో నా బిడ్డ సిగ్గుదీసిమీరు పైశాచికానందం పొందడానికి కూడా పనిచేస్తుందని అప్పుడనుకోలేదు.

చెప్పుదెబ్బ” కవితలో రచయిత తాను తయారు చేసిన తాడుతో పొగరుగిత్తలకు ముకుతాడు వేయడం కోసమేనని అనుకోవద్దు ఆ తాడుతోనే తమ వీవులను కూడా వగలిపోతాయని తెలియ చేశారు. ఆ తాడుతో తమ మెడలకు ఊరిగా మారుతుందని అనుకోలేదు. మా ఇంటి ఆడపిల్లను మీ పైశాచికానందం కోసం అనుకోలేదు వినియోగించుకుంటారని అనుకోలేదంటూ అగ్రవర్ణలను ప్రశ్నిస్తూ సాగిన ఈ కవిత. దళితులను

చెప్పులు కుట్టేది మీ కాళ్ళకు కాదు, మిమ్మల్ని చెంపదెబ్బలు కొట్టడానికి నేను తాళ్ళు పేనేది మీ ముక్కులకు ముకుతాడు వేయడానికి

“శాస్త్రి కవిత”లో మరో బాట

దళిత జాతిలో చెడబుట్టి నాలుగుక్షరాలు పుక్కిట పట్టి ఉత్తీర్ణత సాధించి హిందూ దేవునికి టెంకాయ కొట్టిన్నాడే యావత్ దళిత జాతి సిగ్గుతో చితికిపోయింది.

అని దళిత జాతికి జరుగుతున్న అన్యాయాలను 2009 లో సంఘటన నారాయణ్ ఖడ్లో ఒక దళిత విద్యార్థి పరీక్ష పాసై గుడిలో టెంకాయ కొట్టినందు వేలివేసిన సంఘటనను నిరసిస్తూ రాసినటువంటి కవిత ఇది దళితులు చదువుకోవడం కూడా నేరం, గుడిలో కూడా ప్రవేశం లేదు.

పందాలే పూర్ దేవాలయ ప్రవేశం చేసిన చొక్కమేళుని ఎద్దులకు కట్టి చచ్చేదాకా ఈడ్పించిన సంఘటన నలుగుపిండి వినాయకుణ్ని నెత్తిన మోసిన నేరానికి చావుదెబ్బతిని చరిత్రకెక్కిన ఏ సంగతీ చదవని నిన్ను.

అగ్రకులాలు వెలివేస్తుంది దళిత జాతి యావత్ మీ ముఖాన ఉమ్మేస్తుంది.

దళితుల్ని చరిత్రహీనులుగా చూపుతూ దళితులే అగ్రకులులావాల్నిని వెలివేశారని త్రీవ స్వరంలో శాస్త్రి కవితలో నినదించారు.

“దగాపడ్డ నా జాతిని వెన్నుతట్టి నడిపించి సమత పోరుకు సాగే పంచమ శంఖాన్ని’ అంటూ దళితుల్ని చైతన్య నడిపించాలని

నడుంకట్టారు.

కుల మతాల దురాచార శృంఖలాల్ని ఛేదించి స్వేచ్ఛ వాయువులుపంచే నీలి రంగు జెండాని -నేనే-నేనునేనే కవిత

వైట్ కాలర్స్ కవితలో

ఈ దేశంలో పిండ దశలోనే నాకొక కులపత్రం తల్లిపేగు తెంచుకోగానే

నా కోసం బలీయమైన బానిస బంధం అంటూ నైను సైతం “కవితలో హైందవ వనంలో పూచిన నేనో అంటరాని మల్లెను. కులం కాటుకు బలైన సర్పద్రష్టను. “మతం వేటుకు తెగి పడ్డ మానవ మొక్క” అంటూ రచయిత్రి

చేశారు. దళితోద్యమ ప్రభావాలకూ, పరిణామాలకు ప్రత్యేక్షంగా చూసి అనుభూతి చెందిన రచనలు దళిత కవిత్వం తనదైన శైలిలో తాను కోరుకుంటున్న సమాజాన్ని స్వప్నిస్తూ రాసిన కవితలు. ఒక ఉద్యమకారుని సహచరిగా, గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూ తన చుట్టూ వున్న సమాజాన్ని ప్రభావితం చేయడానికి ఈమె రచనలు చేశారు. దళిత సమస్యలు పట్ల ఈమెకు స్పష్టత, దళితురాలిగా సమాజాన్ని ఏ మేరకు ప్రభావితం చేయాల్సివస్తుందో గుర్తించారు. అంబేద్కర్ ఆలోచనా విధానం, కులనిర్మూలన, ఆచరణలు ఈమె కవిత్వంలో కనిపిస్తాయి.

దళితుల్ని విద్య ద్వారా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయి చేరుస్తుందనే ఈ కవితలో, నానీలు కనిపిస్తాయి. రాజకీయ నాయకులు, ఓట్లు కోసం నోట్లు ఏరగా వేసి అదే ప్రజాస్వామ్యమని, మూలవాసినైన రాజ్యధికారాన్ని అందుకునే హక్కు వున్నదనే విషయం పాటరూపంలో చెప్పారు.

“జన్మ ఖర్మల మనం

వీరేశా

జాగిలాలం కాదు.

మల్లేశా

ఆదిలోన మనం

వీరేశా

బానిసోళ్ళం కాదు

మల్లేశా

పాట:

నక్క జిత్తుల తోటి నయవంచనే వేసి వంతులోళ్ళు మనసు పంచనే తోసారు

“విను””( నిశ్శబ్ద శబ్దం – లక్ష్మి గొల్లపల్లి సాహిత్యం, పుట – 32 )

స్ప ర్శ నిషేదించి అన్పత్యులచేసెరా విద్యనిషేధించి అజ్ఞానుల చేసెరా ఆస్థిని నిషేధించి అన్నార్తులనే చేసెరా ప్రజ్ఞ నిరోధించి నిను బానిసోణ్ణి చేసెరా ఎవడబ్బ సొమ్ము మన ప్రతిభ నిరోధించగా ఏకలవ్య విల్లె నువ్ దుసుకుపోవాలిరా

“ఆదివాసి”

కదలిరా దళితుడా

కదలిరా ఓ దళితుడా

కదం తొక్కుతు పదం పాడుతు

కొలగతులనే మార్చగ రా (కదలిరా – పాట)

నానీలు, పాటలు, కవితలు ఈ మూడు ప్రక్రియల్లో రచనలు చేశారు.

నానీలు :

నానీలు క్రైస్తవ, హిందూమతాలు మధ్యవున్న మత మౌడ్యాల, మూఢత్వం, నిరసిస్తూ రాసిన నానీలు వున్నాయి.

పస్తులుండే వారిని

పట్టించుకోరు

ప్రభువుకు మాత్రం

పదియవ వంతు భక్తిని చాటుకుంటూ తాను సంపాదించే సంపాదనలో

ఆ భగవంతుడికి సమర్పించడం అంటూ

“మరో చోట

మతంలో మనిషి

మందిరంలో దేవుడు

ఇద్దరూ బందీలే

విముక్తి ఏది ?” (నిశ్శబ్ద శబ్దం – లక్ష్మి గొల్లపల్లి సాహిత్యం,పుట – 60 )

ఆకలిలో వున్న వారికి అన్నం పెడితే పుణ్యం వస్తుంది. కాని అది పట్టించుకోరు. ఆ భగవంతుడు ఇచ్చిన దానిని తిరిగి ఆ భగవంతునికే సమర్పిస్తారు. మనిషి మతం అనే సంకెళ్ళు వేసుకొని, హృదయం అనే గదిలో వుంటూ, దేవుడ్ని గుడి అనే గదిలో తలుపులు అనే సంకేళ్ళు వేసి బంధిస్తారు ఇక్కడ ముక్తి ప్రసాదించే వారికి, ముక్తిని కోరుకునే వారికి ఇద్దరికీ విముక్తి లేదు.

“బ్రహ్మక నోళ్ళు

అగ్రవర్ణాలు

అమ్మ కన్నోళ్ళు

అంటరాని నోళ్ళు”( నిశ్శబ్ద శబ్దం – లక్ష్మి గొల్లపల్లి సాహిత్యం, పుట -62)

గ్రామ దేవత పుట్టిన వాళ్ళు దళితులు అని ఎందుకంటే వారు కోలిచే దేవతలు, మాతమ్మ, గంగమ్మ, మారమ్మ, పోలేరమ్మ, గ్రామ దేవతల్ని పూజిస్తారు. అందుకు అమ్మ కన్మోళ్ళు అంటరానివాళ్ళు.

అమ్మానాన్నలు సంపాదించిన ఆస్తిని ప్రేమిస్తారు తప్ప రక్తమాంసాలను వంచి వాళ్ళు జన్మనిచ్చిన వారికి అప్యాయత అనురాగంతో చూసుకోవాలి. అది మరచిన ప్రబుద్ధులు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరిపిస్తున్నారు.

“బిడ్డకు తల్లి ఒడే ఆశ్రమం

అమ్మకు మాత్రం

వృద్ధాశ్రమం

మాంసాన్ని పంచింది.

మమతను పంచింది

అమ్మ

బ్రహ్మ కన్నా మిన్న”( నిశ్శబ్ద శబ్దం – లక్ష్మి గొల్లపల్లి సాహిత్యం, పుట – 63 )

రైతు గురించి రాసిన నానీలు రైతు ఋణ భారంతో ఆత్మహత్య చేసుకుంటున్న

తినే వాడి పేరు

బియ్యపు గింజపై

పండించే వాడిపేరు

రుణ పత్రం పై

-అంటూ రైతు గురించి వివరించారు.

మరో నానీలో

చితిపై కాలుతూ

సగంలో పైకి లేస్తారు

కాటి కాపరి

తాకుతాడని భయం’ అంటూ రచయిత

పుట్టకలో వచ్చిన, పుడకలతో పోదు” అన్నట్లు బతికివున్న మనిషికి శవానికి అంటరానితనం వుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ముగింపు :

రచయిత్రి తన చుట్టూ జరుగుతున్న ప్రతి విషయాన్ని పాటగానో, నానీలుగానో, కవితలుగా అదించారు దగపడిన దళితులు ఇంకా హిందూ, క్రైస్తవ మతాలతో మగ్గిపోతున్నారని భావించి దళిత దర్శనం కవితలో నిలువెల్లా హైందవం నుదటి మీద క్రైస్తవం ఏది నీదైన దళిత్వం ? అని ప్రశ్నిస్తుంది.

‘దళిత సత్తా’ కవిత కొలిమిలో రగిలిన నిప్పురవ్వలు, కుల అహంకారంపై చంద్రుని నిప్పులు వర్షిస్తున్నాయి/ ఎత్తు పల్లాలు వర్ణవ్యవస్థను/ చెక్కి చదును చేస్తుంది. అంటు దళితులను తక్కువ చేసిన మాట్లాడిన వారిని హెచ్చరిస్తుంది.

‘మార్టీలు’ కవితలో మాల, మదిగ, మార్టీలు ఆత్మగౌరవం జీవిస్తుంటారు అని చెబుతూ వాడి ఔన్నత్వం / నా దిగజారుడు తనాన్ని వెక్కిరిస్తుంది / నేను పోసే గంజినీళ్ళు/వాడికి పరమాన్నం కోటి రూపాయలిచ్చినా /గొప్పొళ్ళ కూడ ముట్టడు / అగ్రవర్ణల అహంకారాన్ని / వెలివేసిన వాడి ఆత్మగౌరవం/ కుల సంకెళ్ళును తిప్పికొట్టిన వాని జౌన్నత్వం మాదిగలలో ఉపకులం మార్టీలు. వీరు ఇది మాదిగల కుల పురాణం జంభవంతుని కధను చెబుతూ, మాదిగల దగ్గర జీవనం సాగిస్తూ వుంటారు. దళితుల మీద, దళిత స్త్రీల మీద, దళిత విద్యార్థుల మీద వేర్వురు రూపాల్లో జరుగుతున్న మానసిక, శారీరక హింనను పరిపాలిస్తూ రాసిన కవితలు రిజర్వేషన్లుల వల్ల ఉన్నాతుడై, అదే పల్లెను పరాయిడాన్ని చేసే కవిత వైట్ కాలర్స్ సామాజిక సమస్యలను తనదైన శైలిలో రాశారు.

ఆధార గ్రంధాలు :

1.గోపి ఎన్ – గోపి నానీలు

  2.నిశ్శబ్ద శబ్దం – లక్ష్మి గొల్లపల్లి సాహిత్యం

 3.లక్ష్మీ నరసయ్య .జి.- దళిత సాహిత్యం – తాత్విక దృక్పధం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top